కరోనా వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎక్కడికెళ్లారు : హరీశ్ రావు

-

రైతులకు న్యాయం చేస్తాం.. నిరుద్యోగులకు అండగా ఉంటాం.. మహిళలకు చేయూతనిస్తామని ఇప్పుడు చెబుతున్న కాంగ్రెస్ నాయకులు కరోనా వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. గత కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో హుస్నాబాద్‌లో అభివృద్ధి చెందలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు. కోహెడ మండలంలోని అన్ని గ్రామాలకు భవనాలు మంజూరు చేశామని వెల్లడించారు.

“కేసీఆర్‌ వచ్చాక ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు నిధులు మంజూరు చేశాం. మూడు గంటల కరెంట్‌ ఇస్తే 3 ఎకరాలు పారుతుందని రేవంత్‌రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలను నమ్మితే మోసపోవడం ఖాయం. కాంగ్రెస్‌ మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో చాలా నయం. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో గ్యాస్‌ సిలిండర్‌ రూ.500 అదే భారాస మేనిఫెస్టోలో రూ.400. అధిక సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నాం. రైతుబంధు పెట్టి దుబారా ఖర్చు చేస్తున్నారని ఉత్తమ్‌ అంటున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు జీరో అవుతుంది. బీఆర్ఎస్ గెలిస్తేనే రైతుబంధు డబ్బులు వస్తాయి.” అని హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news