బన్నీ కి షాక్ : పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసిన “రాధేశ్యామ్” !

టాలీవుడ్ రెబల్ స్టార్ హీరోగా నటించిన మూవీ రాధేశ్యాం. ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా… ప్రభాస్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నిన్న అంటే ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ గా రాధేశ్యామ్ టీజర్ ను వదిలింది చిత్రబృందం. ఇంకేముంది విడుదలైన… క్షణాల్లోనే… రికార్డులను బ్రేక్ చేయడం ప్రారంభించింది రాధేశ్యామ్ టీజర్.

ప్రస్తుతం రాధేశ్యాం టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ విడుదలై 24 గంటలు గడిచినప్పటికీ జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది రాధేశ్యామ్ టీజర్. ఇక తాజాగా 50 మిలియన్ల న్యూస్ న్యూస్ దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ సాధించడానికి రాధేశ్యామ్ కు 25 గంటల ముప్పై ఐదు నిమిషాలు పట్టింది.

ఇక ఈ రికార్డు సాధించడానికి అఖండ సినిమాకు 16 రోజులు పట్టగా… అదే అల్లు అర్జున్ నటించిన పుష్ప కు ఏకంగా 20 రోజులు పట్టింది. మరోవైపు 24 గంటల్లో మోస్ట్ వ్యూస్ పొందిన చిత్రం గా టాలీవుడ్ లోనే టాప్ ప్లేస్ లో చేరిపోయింది రాధేశ్యామ్ టీజర్. విడుదలైన 20 గంటల్లోనే రాధేశ్యామ్ తెలుగు టీజర్ యూట్యూబ్ లో 35 మిలియన్ ప్లస్ యూస్ సాధించింది. అలాగే అర మిలియన్ పైగా లైక్స్ కూడా వచ్చాయి.