ఢిల్లీలో హై టెన్షన్.. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన రైతులు !

-

ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. సంయమనం పాటించాలని పోలీసులు ఎంత విజ్ఞప్తి చేసినా రైతులు వెనక్కి తగ్గడం లేదు. టియర్ గ్యాస్ ఉపయోగించినా రైతులు అదుపులోకి రావడం లేదు. వేలాది ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీ లోపలికి చొచ్చుకు వచ్చారు. సెంట్రల్ ఢిల్లీ లోకి రైతులు రాకుండా ఎక్కడికక్కడ రోడ్లపై బారికేడ్లు పోలీసులు ఏర్పాటు చేశారు. వాటిని కూడా రైతులు ట్రాక్టర్లతో పక్కకి ఈడ్చేసి మరీ ముందుకు సాగారు.

ఇక ఎర్రకోట శిఖరంపైకి రైతులు కిసాన్ జెండాను ఎగరవేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఆందోళనలో పలువురు పోలీసులు కూడా గాయాలైనట్లు చెబుతున్నారు. ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడ వద్దని రైతు నాయకులు, రైతు సంఘాలు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఆందోళనలతో ఢిల్లీలో మెట్రో స్టేషన్లను మూసి వేశారు. వేలాది ట్రాక్టర్లు డైలీ లోపలికి రావడం తో పాటుగా సెంట్రల్ ఢిల్లీ కి వెళ్లే రోడ్లను దిగ్బంధం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version