Shakini Dakini Movie Review: ‘శాకిని డాకిని’ సినిమా ఎలా ఉందంటే?

-

నివేదా థామస్‌ రెజీనా కసాండ్రా కలిసి నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఇద్దరు ముద్దుగుమ్మల మల్టీ స్టారర్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అసలు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా.. ఓసారి తెలుసుకుందాం.

కథ ఎలా ఉందంటే.. దామిని(రెజీనా), షాలిని(నివేథ థామస్‌) లు పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అవుతారు. మొదట్లో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు ఉండేవి. ఇద్దరు అహంకారంతో గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు. ఇద్దరికి ప్రతి విషయంలో కూడా విభేదాలు ఉండేవి. అలాంటి వారిద్దరు ఒక అర్ధరాత్రి సమయంలో అమ్మాయి కిడ్నాప్​ని చూస్తారు. వెంటనే పోలీసులకు తెలియజేసినా కూడా అప్పటికే మరో పెద్ద వాళ్ల కేసుతో బిజీగా ఉండటం వల్ల అమ్మాయికి సంబంధించిన కిడ్నాప్ గురించి పట్టించుకోరు. దాంతో ట్రైనీ పోలీసులు అయిన దామిని మరియు షాలిని ఆ కేసులో అనధికారికంగా ఎంక్వౌరీ మొదలు పెడతారు. ఆ సమయంలో ఆ కిడ్నాప్ వెనుక అత్యంత పెద్ద క్రైమ్‌ జరుగుతుందని గుర్తిస్తారు. ఆ క్రైమ్‌ ను ఇద్దరు ఎలా బయటకు తీసుకు వస్తారు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది కథ.

ఎవరు ఎలా చేశారంటే… రెజీనా , నివేథ థామస్​లు ఇద్దరు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇద్దరికి ఇద్దరు కూడా పోటా పోటీ అన్నట్లుగా నటించి మెప్పించారు. ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్మెంట్​ను అందించేందుకు ఇద్దరు కూడా కాస్త ఎక్కువగానే కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నివేథ థామస్‌ యొక్క బబ్లీ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. రెజీనా తన రెగ్యులర్ లుక్​లో కనిపించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక సినిమాలో మిగిలిన పాత్రల్లో నటించిన సుధాకర్ రెడ్డి.. రఘు బాబు.. పృథ్వీల కామెడీ ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం: మిడ్ నైట్‌ రన్నర్స్ అనే కొరియన్ మూవీకి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్‌ వర్షన్ స్క్రీన్‌ ప్లేలో చాలా మార్పులు చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సినిమాను తీసుకు రావడంలో దర్శకులు సఫలం అయ్యారు. ఒక మంచి ఎంటర్‌టైన్మెంట్‌ స్క్రిప్ట్‌ గా సీరియస్ కథను మల్చడం అంటే కాస్త కష్టమైన విషయమే. దర్శకుడు ఆ విషయంలో సఫలం అయ్యాడనే చెప్పాలి. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం లాజిక్ ను మిస్‌ అయ్యాడు. ముఖ్యంగా ఆ ఇద్దరు అమ్మాయిలు పోలీస్‌ అకాడమీలో ఎలా చేరారు.. ఎందుకు చేరారు అనే విషయాన్ని క్లీయర్ గా చెప్పలేదు. సినిమాటోగ్రపీ బాగుంది. పలు సన్నివేశాల్లో నాచురాలిటీని తీసుకు రావడంలో ఆయన సఫలం అయ్యాడు. సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా నిరాశే అన్నట్లుగా ఉంది. ఎడిటింగ్‌ లో లోపాలున్నాయి. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌

  • కామెడీ, రెజీనా, నివేతల యాక్టింగ్‌, సెకండాఫ్‌

మైనస్‌ పాయింట్స్‌

  • రొటీన్‌ కామెడీ
  • ఎమోషనల్‌ కనెక్టివిటీ లేకపోవడం
  • మ్యూజిక్‌

ఇది ఒక సున్నితమైన ఆడవారికి సంబంధించిన విషయమే అయినా కూడా కొన్ని ఎంటర్ టైన్మెంట్‌ సన్నివేశాలతో చూపించే ప్రయత్నం చేసి పర్వాలేదు అనిపించారు. కొన్ని సన్నివేశాల విషయంలో లాజిక్ మిస్‌ అయ్యింది.. అలాగే ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆకట్టుకోలేక పోయారు. సెకండ్‌ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉండవచ్చు. మొత్తంగా సినిమాను ఒక మంచి ప్రయత్నంగా సమయం ఉంటే చూడవచ్చు.

రేటింగ్‌ : 2.5/5

 

Read more RELATED
Recommended to you

Exit mobile version