జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఎన్నిక చెల్లదంటూ గతంలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దానికి కౌంటర్‌గా ఎమ్మెల్యే మాగంటి సైతం తన ఎన్నిక చెల్లదంటూ ఆధారాలు లేకుండా వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అజారుద్దీన్ వేసిన పిటిషన్ కొట్టివేసింది.
దీంతో అజారుద్దీన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. అదేవిధంగా ఈ పిటిషన్ వేసిన మాజీ క్రికెటర్, కాంగ్రెస్ కంటెస్టెట్ ఎమ్మెల్యే అజహరుద్దీన్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. మాగంటి ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌కు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఊరట లభించినట్లు అయ్యింది.