మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతా వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి కాస్త రిలీఫ్ వచ్చింది అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. అన్ని బ్యాంక్ బ్రాంచులకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది.
నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని ఖాతాదారులను అడగవద్దు అని ఎస్‌బీ చెప్పింది. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసుకోకపోతే అకౌంట్ డెడ్ అయిపోతుంది. కనుక నిజంగా ఈ విషయం కస్టమర్స్ కి రిలీఫ్ ఇచ్చే వార్తే.
లో రిస్క్ ఉన్న కస్టమర్లను పదేళ్లకు ఒకసారి కేవైసీ అడుగుతాయి. అదే మీడియం రిస్క్ ఉన్న కస్టమర్లను 8 ఏళ్లకు ఒకసారి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని బ్యాంక్ అంటుంది. అదే హైరిస్క్ ఉన్న కస్టమర్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని కోరుతుంటాయి.
ఒకవేళ కనుక కేవైసీ అప్‌డేట్ చేసుకోకపోయినా కూడా మే 31 వరకు బ్యాంక్ ఖాతాలను పాక్షికంగా స్తంభించవద్దని బ్యాంక్ బ్రాంచులకు ఎస్‌బీఐ చెప్పడం జరిగింది. ఒకవేళ అవసరం అనుకుంటే పోస్ట్ లేదా రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ ద్వారా కస్టమర్లు పంపిన వివరాల ప్రాతిపదికన కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.