ఆగస్టు 15 అనేది పండుగ మాత్రమే కాదు. అదో గొప్ప దినం. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన రోజు. నేడు మనం ఇంత స్వాతంత్ర్యంగా భారతదేశంలో బతుకుతున్నామంటే దానికి కారణం ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు.
ఆగస్టు 15 వచ్చిందంటే చాలు.. ప్రతి భారతీయుడిలో ఒక ఉద్వేగం, ఒక ఆలోచన, ఒక పోరాట ప్రతిమ.. గుర్తుకొస్తాయి. చిన్నాపెద్దా, ముసలి, ఆడామగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఆగస్టు 15 ను సంబురంగా చేసుకుంటాడు. సంవత్సరం మొత్తంలో వచ్చే పండుగలు ఒక ఎత్తు అయితే… ఆగస్టు 15 మరో ఎత్తు.
ఆగస్టు 15 అనేది పండుగ మాత్రమే కాదు. అదో గొప్ప దినం. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన రోజు. నేడు మనం ఇంత స్వాతంత్ర్యంగా భారతదేశంలో బతుకుతున్నామంటే దానికి కారణం ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు.
వాళ్ల బ్రిటీషర్లపై పోరాడకుంటే.. నేడు మనం ఇంత ఆనందంగా ఉండేవాళ్లం కాదు. తమ ప్రాణాలను త్యాగం చేసి… తమ జీవితాన్ని త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి.. భారతదేశ ప్రజలందరికీ రుణపడి ఉన్నారు.
రెండు వందల ఏళ్ల బ్రిటీష్ పాలనను తెగ తెంచుకొని బ్రిటీషర్లను పారదోలి… నేడు స్వేచ్ఛావాయువులను పీల్చుతున్నాం. భారతదేశం అంటేనే ఎన్నో మతాలు, కులాలు, సంస్కృతుల కలయిక. అవన్నీ వేరయినా.. మనమంతా ఒకటే.. మనమంతా భారతీయులం అని సగర్వంగా తన ఎత్తుకొని చెప్పుకునే రోజే ఆగస్టు 15.
తమ జీవితాన్ని కేవలం దేశం కోసమే అంకితం చేసిన ఎందరో మహానుభావులను ఆగస్టు 15న జెండావందనం సందర్భంగా గుర్తు చేసుకుందాం. వాళ్లను మనసుతో నమస్కరిద్దాం. జైహింద్. జై భారత్.