చర్మం సాగడం వల్ల ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఇంటి చిట్కాలు..

-

చర్మం సాగడం వల్ల ఏర్పడ గీతలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలో గర్భం కారణంగా ఇలాంటి గీతలు ఏర్పడతాయి. ఆ టైమ్ లో బిడ్డ కోసం చర్మం సాగుతుంది కాబట్టి గీతలు వస్తుంటాయి. అదే కాకుండా సాధారణం కంటే ఎక్కువ బరువు పెరుగుతుంటే కూడా ఇలాంటి గీతలు వస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు పని చేస్తాయి. మార్కెట్లో దొరికే రకరకాల సాధనాలను వాడి చూసి, ఫలితం లేదని బాధపడుతుంటే ఈ చిట్కాలు మీకు బాగా పని చేస్తాయి.

నిమ్మరసం:

ఒక పాత్రలో నిమ్మరసం తీసుకుని, దాన్ని గీతలు ఏర్పడిన ప్రదేశాల్లో మర్దన చేయాలి. అలా పదినిమిషాల పాటు మర్దన చేసి, మరో పది నిమిషాలు కూర్చోవాలి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి నాలుగు రోజుల పాటు చేస్తే సరిపోతుంది.

ఆముదం నూనె

ఆముదం నూనెకి ఆయుర్వేదంలో మంచి ప్రాధాన్యం ఉంది. సాగిన గీతలు ఏర్పడ్డ ప్రాంతంలో ఆముదం నూనెతో మర్దన చేసి కొద్ది సేపటి తర్వాత నీటితో శుభ్రపర్చుకుంటే చాలు.

కాఫీ:

సాగిన గీతలను తొలగించడంలో కాఫీ చాలా బాగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ కోకో బటర్ లో కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఆ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడ్డ భాగాల్లో మర్దన చేయాలి. పది నిమిషాల పాటు మర్దన చేసి నీళ్ళతో కడుక్కోవాలి. వారానికి కనీసం మూడుసార్లయినా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గుడ్డులోని తెల్ల సొన

గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది. అందులోని తెల్లసొన చర్మానికి మేలు చేస్తుంది. తెల్ల సొనని మాత్రమే తీసుకుని బ్రష్ సాయంతో సాగిన గీతలు ఏర్పడ్డ ప్రదేశంలో రాయాలి. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version