మహేష్ బాబు సినిమాలో పవన్ మాజీ భార్య..!

-

అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ‘మేజర్’ అనే చిత్రాన్ని మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ మరియు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఇందులో ఓ కీలక పాత్రకు గాను రేణు దేశాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ, చాలా పవర్ ఫుల్ పాత్ర కావడంతో ఆమె అంగీకరించే అవకాశాలు వున్నాయని అంటున్నారు.

తన స్థాయికి తగ్గా మంచి ఆఫర్లు వస్తే నటించడానికి అభ్యంతరం లేదంటూ ఒకప్పటి కథానాయిక రేణు దేశాయ్ ఇటీవల చెబుతున్న సంగతి తెలిసిందే. పైగా ఆమె కుమారుడు అఖీరా నందన్ అడివి శేష్ కి మంచి అభిమాని కావడం వలన అడివి శేష్ – రేణు దేశాయ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కావున పక్కాగా రేణు దేశాయ్ ఈ ‘మేజర్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఈ చిత్ర టీం నమ్మకంగా ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version