ప్రస్తుత పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

-

కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. కరోనా లక్షణాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 170మందికి కరోనా సోకగా.. అందులో నలుగురు మృతి చెందారు. కరోనా ధాటికి ప్రభుత్వాలు తలవంచక తప్పడం. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా అది వ్యాప్తిస్తూనే ఉంది. కరోనాపై అవగాహన కలిగించేందుకు ప్రభుత్వాలు, సెలెబ్రిటీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలంతా ముందుకు వచ్చి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవల్సిన నియమాలు, కరోనాపై అవగాహన వచ్చేలా సందేశాలు ఇస్తున్నారు. ఇందులో కొందరు సెటైరికల్‌గా కూడా స్పందిస్తున్నారు. తాజాగా రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నలుగురిలో తిరగకండి, గుమిగూడకండి సమాజానికి దూరంగా ఉండండని అందరూ సలహా ఇస్తున్న నేపథ్యంలో రేణూ దేశాయ్ ఓపోస్ట్ చేసింది. సమాజానికి దూరంగా ఉండటం అనే విషయంలో తాను మాస్టర్ అని ,అదో ఆర్ట్ అని తెలిపింది. తనకు చిన్నప్పటి నుంచే అది అలవాటని, అయితే తనకు అంత సులభమైన పనిని ఇలా అందరూ ఎంతో కష్టపడి చేస్తుంటే తనకు నవ్వొస్తుందని తెలిపింది. దయచేసి వీలైనంతవరకు ఇంట్లో ఉండి, కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని అరికట్టండి.. వైద్య నిపుణుల మాట వినండి. సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండండని తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version