ఖమ్మం పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ మళ్లీ యాక్టివ్ అయ్యారా

-

మొన్నటివరకు జిల్లా రాజకీయాల్లో అంటి ముట్టనట్టుగా ఉన్న సీనియర్ నేత ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. మొన్నటి వరకు నా చేతులకున్నవి గాజులు కావు.. విష్ణు చక్రాలు అంటూ చెప్పిన లేడీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు నాకు చేతులున్నాయంటూ.. చేతి గుర్తుకు యాస ప్రాసతో ఉపన్యాసాలు దంచేస్తోంది. మొన్నటి వరకు సైలెంటయిన సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఖమ్మం రాజకీయాల్లో సడన్ గా యాక్టీవ్ అయ్యేసరికి హస్తం పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుందట…

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేణుక చౌదరి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పట్టుబిగించే పనిలో పడ్డారట. రేణుక స్వపక్షం విపక్షం అని చూడకుండా తనకు నచ్చని నేతల పై బహిరంగ సమావేశాల్లోనే కామెంట్స్ చేస్తుంటుంది. సాధారణంగా ఆమె మాటలు విపక్ష పార్టీలకంటే సొంత పార్టీ నేతలనే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. పార్టీలో విభేదాలు ఉన్నాయని చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తుందా అన్న ప్రచారాన్ని ఆమె ప్రత్యర్థులు కూడ చేస్తుంటారు.

తాజాగా ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఖమ్మం జిల్లా ఆడ బిడ్డగా చెప్పుకునే రేణుక చేసిన ప్రసంగం పార్టీ నాయకులను అమితంగా ఆకట్టుకుందట. మొన్నటి వరకు చేతి గాజుల గురించే మాట్లాడే రేణుక చౌదరి ఇప్పుడు మాత్రం తన పంధా మార్చివేసింది. అధికార పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండండి. ఈ చేతులు మీ వెంట పడతాయి. తప్పు చేస్తే చేతులు ఊరుకోవు జాగ్రత్త అంటు హెచ్చరికలు జారీ చేసింది. గాజులను వదిలేసి ఇప్పుడు చేతులను పట్టుకుంది. ఈ చెయ్యి గుర్తు పై అదిరిపోయే స్పీచ్ ఇచ్చిందట.

కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు అమ్ముడుపోరు.. ఎవడన్న అమ్ముడు పోతే.. ఈ చెయ్యి ఎదురువుతుందని గుర్తుకు పెట్టుకోండి. చాలా విచిత్రమైన గుర్తు హస్తం గుర్తు.. అశ్వీరదించేది.. శత్రువు ను గల్ల పట్టుకునేది, సైకిల్ టైర్ లో గాలి తీసేది హస్తం.. ఓటు పైన నొక్కేది హస్తం.. చెయ్యి లేకపోతే కారు నడవదని టిఆర్ఎస్ కు తెలుసు.. ఆ కమలాన్ని తుంచి పడేసేది హస్తం అంటూ యాస ప్రాసలతో కేడర్ లో ఉత్సాహం రేకిత్తించిందట..

ఇక జిల్లాలోని నేతల పై సైతం అదే స్థాయులో కామెంట్స్ చేసిందట. అసలైన కార్యకర్తలను కొన్ని సార్లు గుర్తించలేదు. టిక్కెట్లు ఇవ్వవలసిన సమయంలో ఇవ్వలేదు. నేనెప్పుడు ఎప్పుడు అన్యాయం జరిగిందన్నా గుర్తించి మాట్లాడుతాను..పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించను.. ఎక్కడైనా ప్రశ్నిస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొన్నటి వరకు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు జిల్లాకు ఎక్కువ రాకపోవడంతో ఆమె ఫైర్ మసక బారుతోందన్న విమర్ష సొంత కేడర్ లోనే వినిపించింది. తాజాగా రేణుక చౌదరి మళ్లీ స్పీడు పెంచడంతో మేడమ్ మళ్ళీ యాక్టివ్ అయ్యారని ఫుల్ జోష్ లో ఉన్నారట హస్తం పార్టి కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version