మరి కొన్ని రోజులలో తెలంగాణలో లోక్ సభకి సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ కి సంబంధించి ప్రలోభాలు పనిచేయవని గెలిచే నేతలకే కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇస్తుందని రాజ్యసభ అభ్యర్థి రేణుక చౌదరి అన్నారు.
గురువారం నాడు మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎవరూ ఆపలేరన్నారు అని ఆశ6 భావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో రాజ్యసభకు వెళ్లడం తన అదృష్టమని, తనకు హై కమాండ్ రాజ్యసభ ఇస్తారని అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు.
అర్థరాత్రి కాల్ చేసి రాజ్యసభ కోసం నామినేషన్‌కి సిద్ధం అవ్వాలని చెప్పారన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడుతానని ధీమా వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ఖమ్మంలో పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ తన ఇల్లు లాంటిదని,దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వ్యతిరేకించే వాళ్లు ఫూల్స్ అని ఆరోపించారు .రాజీవ్ గాంధీ మహిళల జాతకాలు మార్చేశారని అన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావుకు కోరికలు బాగానే ఉన్నాయని రేణుకా చౌదరి సెటైర్లు వేశారు.