రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో భారత్ గణతంత్ర దేశంగా అవతరించింది. ఆనాటి నుండి కూడా ఏటా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవం ని మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల ని ఢిల్లీ లోని రాజ్‌పథ్ లో జరగనున్నాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ ఉంటుంది. పరేడ్‌ను వీక్షించాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి వుంది. ఆన్‌లైన్ ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్www.aamantran.mod.gov.in ను టికెట్స్ బుక్ చేసుకునేందుకు కేంద్రం ప్రారంభించింది. ఇక మరి ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనేది చూసేద్దాం.
దీని కోసంముందు అధికారిక వెబ్‌సైట్ www.aamantran.mod.gov.in లోకి వెళ్లాల్సి వుంది.
మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ జనరేట్ అవుతుంది రిజిస్టర్ యూజర్లకి.
కొత్త యూజర్ అయితే మాత్రం పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వంటి వివరాలని ఇవ్వాల్సి వుంది. ఓటీపీ సహాయంతో లాగిన్ అవ్వాలి.
టికెట్ బుకింగ్ పేజీ మీ స్క్రీన్ పై వస్తుంది.
ఈవెంట్ రకాన్ని సెలెక్ట్ చెయ్యాలి.
తరువాత ఎన్‌క్లోజర్ నార్త్ లేదా సౌత్ ఎంపిక చేసి పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలని ఇవ్వండి.
తరవాత పేమెంట్ చేయండి. రిపబ్లిక్ డే పరేడ్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. రూ.20, రూ.100, రూ.500 టికెట్స్ వున్నాయి. జనవరి 7 నుంచి 25వ తేదీ వరకు టికెట్ ని బుక్ చేసేయచ్చు.
కౌంటర్స్ వద్ద కూడా కొనచ్చు. అప్పుడు మీరు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు అవసరం.