అధిక బరువున్న మగవారికి పరిశోధకుల హెచ్చరిక! షాకింగ్‌ విషయాలు వెల్లడి..

-

అధిక బరువు ఈరోజుల్లో చాలామందిని మానసికంగా..శారీరకంగా చాలా ఇబ్బందిపెడుతుంది. ఆహారపు అలవాట్ల వల్ల కొందరు లావు అవుతుంటే..వారసత్వం అందిపుచ్చుకుని మరికొందరు బరువు పెరుగుతున్నారు. అయితే ఒబేసిటీ కారణంగా..రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయని ప్రతిఒక్కరికీ తెలుసు..కానీ..తాజాగా అధికబరువు ఎముకల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది పరిశోధకులు కనుగొన్నారు. ఈ సమస్య ఆడవారిలో కంటే..మగవారిలోనే ఎక్కువ ఉన్నట్లు చెబుతున్నారు.
అమెరికన్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ఏం చెబుతుందంటే..శరీరంలో కొవ్వు స్థాయిలు అధికంగా ఉండే పురుషులతోపోల్చితే, సాధారణ బరువు ఉండే వ్యక్తుల్లోకన్నా ఎముకల సాంద్రత చాలా తక్కువగా ఉందని తెలిసింది. అంటే ఎముకల ఆరోగ్యం ఊబకాయంతో ముడిపడి ఉంటుంది. 60 ఏళ్ల లోపు ఉన్న సుమారు 11 వేల మందిపై చేసిన అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ఆఫ్ ది ఎండోక్రైన్ సొసైటీలో ప్రచురితమైన రీసెర్చ్‌ పేపర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ పరిశోధన పత్రం ప్రకారం.. 60 ఏళ్లలోపున్న 10,814 మందిలో బోన్‌ మినరల్‌ డెన్‌సిటీనీ విశ్లేసించిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించారు. దీని కోసం యూఎస్‌ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ టెస్టింగ్ సర్వే (NHANES) నుండి డేటాను స్వీకరించారు. ఇవి 2011 నుండి 2018 వరకు సేకరించిన గణాంకాలు.’అధిక కొవ్వులతో కూడిన ఆహారాన్ని తీసుకునే వారిలో ఎముకలు బలహీణంగా ఉండటాన్ని వాళ్లు గుర్తించారట. ఈ మార్పు స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుందట. అని ఇల్లినాయిస్‌లోని చికాగో మెడిసిన్ విశ్వవిద్యాలయం ఎమ్డీ రాజేష్ జైన్ తెలిపారు.
అధిక కొవ్వు తీసుకోవడం ఎముక ఖనిజ సాంద్రతపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు గుర్తించారు. ముఖ్యంగా పురుషుల విషయంలో అధిక కొవ్వులు ఎముకల ఆరోగ్యానికి హాని తలపెడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అదేవిధంగా అధిక బరువు ఉన్న రోగులు ఎముకలు గుల్లబారే వ్యాధి బారిన పడుతున్నట్టు కూడా హెల్త్‌కేర్ ప్రొవైడర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యం, ఎముక పగుళ్లతో బాధపడే రోగులు, వంశపారంపర్యం లేదా స్టెరాయిడ్ వాడకం వంటి ఇతర కారకాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువని’ జైన్ తెలిపారు.
అధికబరువు ఉన్నవారు..అది వారి పాలిట శాపంగా భావించకుండా..వీలైనంత వరకూ కష్టపడి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే…ఎన్నో సమస్యలకు అడ్డుకట్ట వేసినట్లే.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version