రేవంత్ రెడ్డే మా సీఎం.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

-

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లు ఆయనే మా సీఎం అంటూ బాంబ్ పేల్చారు. నేడు గాంధీ భవన్లో ఏఐసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్  తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి  అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ప్రస్తుతానికి రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చి చెప్పారు.

బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ ధృడ సంకల్పంతో ఉన్నారని.. అందులో భాగంగా ఏదోకరోజు బీసీల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాబోతున్నారని.. ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికలు బీసీల చుట్టూ తిరుగుతాయని స్పష్టం చేశారు. త్వరలో జరుగబోయే కేబినెట్ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news