జై బాపు, జై సంవిధాన్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి వచ్చానని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారు.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు జాతీయ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మాట్లాడారు. కులగణన సిటీ స్కాల్ లాంటిదని.. 46 శాతం ఉన్న బీసీలకు 10 శాతం WES లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేస్తోందన్నారు. కులగణన వల్ల వెనుకబడిన వర్గాల వారి కోసం న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన చేయాలన్నారు. బీజేపీ రాజ్యాంగం మీద దాడి చేస్తుందన్నారు అజయ్ సింగ్ యాదవ్.
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లో ఈడీ, సీబీఐలతో కాంగ్రెస్ నేతలపై దాడి చేస్తున్నారని.. మహారాష్ట, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుందన్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు ముద్దు అనేది కాంగ్రెస్ నినాదం.. ఓబీసీ విద్యార్థులు ఎలాంటి స్కాలర్ షిప్ లు, నీట్ లో సీట్లు పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ ను ఎత్తి వేయాలన్నారు.