బీఆర్ఎస్ బిజెపి రాజకీయ ఎత్తుగడలో భాగంగా కవితని అరెస్ట్ చేయడం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఈ మేరకి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ కి ఒకరోజు ముందు కవిత అరెస్ట్ చేయడం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని అన్నారు కవిత అరెస్టు చేయడం ద్వారా ఆ క్రెడిట్ ని బిజెపి అరెస్టు ద్వారా బీఆర్ఎస్ అనుభూతిని పొందే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
కవితని అరెస్ట్ చేస్తే తండ్రిగా కాకపోయినా పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్ స్పందించలేదని అన్నారు. కెసిఆర్ నరేంద్ర మోడీ మౌనం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలవబోతోంది అన్నది సర్వే చెప్తోందని అందుకని కాంగ్రెస్ ని దెబ్బ తీయడానికి బీఆర్ఎస్ బిజెపి ఈ చీపు పొలిటికల్ డ్రామా కి తెర లేపారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.