కాంగ్రెస్ వేదిక ఉంటేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి : రేవంత్‌ రెడ్డి

-

మరోసారి బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. గాంధీ భవన్ ఆవరణలో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి తదితరులు హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జనరంజక పాలన అందించే గొప్ప నాయకులను అందించిందని అన్నారు. దేశంలో దళితులకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా కాంగ్రెస్ అవకాశం కల్పించిందని.. ఏఐసీసీ అధ్యక్షుడుగా ఖర్గే ను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.

ఏమీ పట్టన్నట్లు బీఆర్ఎస్ అంటూ.. దళితుడిని అధ్యక్షుడిని చేసే దమ్ము మిగతా పార్టీలకు ఉందా? అని ప్ర‌శ్నించారు. దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానానికి మల్లికార్జున ఖర్గేనే ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలంగాణలో మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నాం. కానీ ఆ హోదాను చూసి ఓర్వలేని కేసీఆర్.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేశారని అన్నారు కాంగ్రెస్ వేదిక ఉంటేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇందిరమ్మ హయాంలో 24లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ ది అని అన్నారు. కాంగ్రెస్ ఇస్తే బీఆర్‌ఎస్ వాటిని గుంజుకుంటుంది. బీజేపీ చోద్యం చూస్తోంది అని విమ‌ర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. మా ప్రభుత్వంలో ప్రతీ మండలంలో ఒక క్రిస్టియన్ స్మశానవాటిక ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version