జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి ‘హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర’

-

జనవరి మాసం 26 వ తేదీ నుంచి ‘హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర’ ప్రారంభం కానుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్ లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ కెసిఆర్ చేతిలో బందీ అయ్యిందని, ప్రధాని మోదీకి దేశ భద్రత పట్టదని, ప్రభుత్వాలను కూల్చడమే పరమావధి అయిందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని దోచుకోవడం పూర్తయిందని భావిస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ పేరుతో జాతీయస్థాయిలో దోపిడీకి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బిజెపి, కేసిఆర్ ల ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version