కేరళ కి సీఎం రేవంత్ రెడ్డి..!

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేరళ పర్యటనకి వెళ్ళబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా కేరళ కాంగ్రెస్ నిర్వహిస్తున్నది ఈ సమరాగ్ని ముగింపు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. ఇక్కడ ప్రసంగించబోతున్నారు. అలానే ఈ రాత్రికి తిరిగి హైదరాబాద్ రాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకి కారణం ఈ ముగింపు సభ అని తెలుస్తోంది.

ఈ సమరాగ్ని ముగింపు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటలకి ప్రత్యేక విమానం లో రేవంత్ రెడ్డి బయలుదేరబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి దేవదాసు మున్షి తిరువనంతపురం చేరుకున్నారు. ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డి మీద సంక్షేమ పథకాల డిమాండ్ విపరీతంగా ఉంది. చెప్పిన వాటిని చేసి చూపించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అడుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news