ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైని చనిపోయారు గురువారం ఉదయం నవి ముంబైలోని టౌన్షిప్ లో సైక్లింగ్ చేస్తుండగా ప్రమాదం బారిన పడి ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. సైక్లింగ్ చేస్తున్న టైం లో ఓ క్యాబ్ ఢీకొనడంతో తీవ్ర గాయాలు పాలయ్యారని స్థానికులు చెప్తున్నారు. తక్షణం ఆసుపత్రికి తరలించగా అప్పటికే అవతార సైని చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు.
ఘటనకి కారణమైన కార్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు అవతార్ సైని ఇంటెల్ సంబంధించి మైక్రో ప్రాసెసర్లని రూపొందించడంలో కీలకంగా ఉన్నారు ముఖ్యంగా పెంటియం ప్రాసెసర్ డిజైన్ చేసే బృందానికి హెడ్గా పని చేశారు. ఇంటెల్ దక్షిణాసియా అవిభాగం డైరెక్టర్ గా కూడా అవతార్ సైని బాధ్యతలు నిర్వహించడం జరిగింది.