వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న గుర్నాథ్‌రెడ్డి.. ఇవాళ రేవంత్ రెడ్డి తో సమావేశం అయ్యారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు ఈ సందర్భంగా గుర్నాథ్‌రెడ్డి మద్దతు కోరారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ నేత గుర్నాథరెడ్డి గారిని,కుమారుడు కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
భారత్ జోడో,హాత్ సే హాత్ జోడో పై చర్చ జరిగింది.శ్రీ మల్లికార్జున ఖర్గే గారితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.#Kodangal pic.twitter.com/2mkkv1eMig
— Revanth Reddy (@revanth_anumula) January 27, 2023