తెలంగాణ సాధించుకున్న తర్వాత పార్టీ ఫిరాయింపులు ఎక్కువయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో నేతలకు ఫిరాయింపుల రోగం వచ్చిందని విమర్శించారు. పార్టీలు ఫిరాయించే ఈ కాలంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్న మిత్రులందరికి అభినందనలు తెలిపారు. గతంలో నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా పార్టీ ఫిరాయించారని.. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిరాయించారని కాంగ్రెస్ అయనకు టికెట్ ఇవ్వలేదా ఇవ్వనందా అని ప్రశ్నించారు.
చౌటుప్పల్ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ సమన్వయ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో మాణిక్కమ్ ఠాగూర్‌తోపాటు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే వాళ్ల మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రెడ్డి, గీతారెడ్డి తదతర నేతలు పాల్గొన్నారు.