తప్పిన రైలు ప్రమాదం.. రైల్వే ట్రాకుపై సిలిండర్

-

ఉత్తరాధిలో ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, రైల్వే ట్రాకులపై బండరాళ్లు, ఐరన్ రాడ్లు, సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలు వరుసగా దర్శనమిస్తున్నాయి. కొందరు ఆకతాయిలు ఇలా చేస్తున్నారా? లేదా రైలు ప్రమాదాలకు ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? అనే దానిపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. రైల్వే ట్రాకులపై బండరాళ్లు పెడుతున్న పలువురిని ఈ మధ్యకాలంలో అరెస్టు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 5:50 గంటల టైంలో యూపీలోని కాన్పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వైపు గూడ్స్ రైలు వెళ్తుండగా పట్టాలపై గ్యాస్ సిలిండర్‌ను లోకో పైలట్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి రైలును ఆపాడు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది ట్రాక్ పై ఉన్న సిలిండర్‌ను తొలగించి తనిఖీ చేశారు. అది 5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఖాళీ సిలిండర్‌గా వారు గుర్తించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశాలిచ్చినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version