2025 క్వాడ్ సమ్మిట్ ఆతిథ్యానికి ఇండియా రెడీ : ప్రధాని మోడీ

-

2025లో జరిగే క్వాడ్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. అమెరికాలోని డెలావర్‌ విల్మింగ్టన్‌లో ప్రస్తుతం జరుగుతున్న క్వాడ్ సమావేశానికి ప్రధాని మోడీ హాజరైన విషయం తెలిసిందే. అక్కడ వివిధ దేశాధినేతలతో ఆయన సమావేశం అయ్యారు. 2021 నుంచి క్వాడ్ ఎంతో పురోగతిని సాధించిందని, ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో క్వాడ్ అవసరం ఎంతో ఉందని మోడీ పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విలువల ప్రతిపాదికన దేశాలు కలిసి పనిచేయడం మానవాళికి ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం క్వాడ్‌లో ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.ఆసియా-పసిఫిక్ దేశాల అభివృద్ధి కోసం క్వాడ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులోని సభ్యదేశాలు పరస్పర సహకారం, అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులపై ఈ దేశాలు పరిశీలిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version