సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిని..సోనియాగాంధీ ఇచ్చారని…ఈ రోజు తెలంగాణ దోపిడీ, దోంగల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తానని హెచ్చరించారు రేవంత్. తనకు పీసీసీ ప్రకటించగానే.. ప్రగతి భవన్ విపక్ష నేతలకు తలుపులు తెరుచుకున్నాయని…యువ ప్రతినిధి ఉండాలనే ఆలోచనతో.. సీనియర్లను ఒప్పించి తనకు పీసీసీ అధ్యక్ష పదవిని సోనియా గాంధీ ఇచ్చారని పేర్కొన్నారు. నా కుటుంబానికి ఏ ఆపద లేదు.. నా బాధ్యత మొత్తం తెలంగాణ సమాజమన్నారు. కేసీఆర్ చేతిలో బంధి అయిన తెలంగాణకు విముక్తి కల్పిస్తానని..సమ్మక్క, సారలమ్మ కాకతీయ రాజుల మీద ఏ విధంగా పోరాటం చేశారో.. అలాగే సీతక్కతో కలిసి పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ను వెయ్యి కిలోమీటర్ల లోతులో పాతిపెడతానని హెచ్చరించారు రేవంత్. నా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ఆరు నెలలకు ఒకసారి ఎస్సై మారుతున్నాడని.. ఎస్సై పోస్టుకు పది లక్షలు వసూలు చేస్తున్నారని… సీఐకి 25 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు నెల.. నెల మామూళ్లు ఇవ్వాల్సి వస్తోందని.. ఈ విష సంస్కృతికి కారణం సీఎం కేసీఆర్ పరిపాలన కాదా ? అని నిలదీశారు. కేసీఆర్ పోతేనే.. ఈ విష సంస్కృతి పోతుందని…టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులను అడుగుతున్న.. ఇజ్జత్ లేని బతుకు అవసరమా? అని ప్రశ్నించారు. పంటకు చెదలు వస్తే.. కాపాడుకోవడానికి ఏం చేస్తామో.. భవిష్యత్తు తరాలను కాపాడాలంటే నడుం బిగించాలని పిలుపునిచ్చారు.