టీఆర్‌ఎస్‌కు కౌశిక్‌ రెడ్డి… కోవర్టు : రేవంత్‌ ఫైర్‌

-

కౌశిక్‌ రెడ్డి పార్టీ మార్పుపై రేవంత్‌ రెడ్డి స్పందించారు… టీఆర్‌ఎస్‌ పార్టీతో కుమ్మక్కై కౌశిక్‌ రెడ్డి కోవర్టుగా మారారని మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్ లో ఇంటి దొంగలను వదిలి పెట్టేది లేదని… ఈ నెల ఆఖరి వరకు కాంగ్రెస్ దొంగలకు డెడ్ లైన్ ఇస్తున్నానని హెచ్చరికలు జారీ చేశారు రేవంత్‌ రెడ్డి. పార్టీకి చేడు చేసే వాళ్లు వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు.

పార్టీ నేతల అభిప్రాయాల మేరకు త్వరలోనే హుజురాబాద్‌ టిక్కెట్‌ ఇస్తామని పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. 2023 లో గోల్కొండ ఖిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని… తప్పుడు కేసులు పెడితే ప్రభుత్వ అధికారుల తోడ్కల్ తీస్తామని హెచ్చరించారు. ఇక అటు ఆడియో టేపుల వ్యవహరం బయటపడటంతో కౌశిక్‌ రెడ్డిని పార్టీ నుంచి కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. కాగా… కాసేపటి క్రితమే కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version