6 నెలల్లో రేవంత్ సర్కార్ కూలడం ఖాయం : మాజీ మంత్రి ఎర్రబెల్లి

-

ఇటీవల సియోల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చే ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీపావళి పండుగకు ముందే రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలతాయని హింట్ ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి చేశారన్నది మాత్రం వెల్లడించలేదు. అది ప్రతిపక్షానికి వర్తిస్తుందా? అధికార పక్షానికి వర్తిస్తుందా? అనే దానిపై నేటికి సస్పెన్స్ కొనసాగుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణితో పాటు మొత్తం ఎనిమిది నుంచి 10 అంశాల్లో ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. తాజాగా మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బాంబులు పేలబోతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.వారిపై తాము బాంబులు వేయాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్ వాళ్లే ఒకరిపై ఒకరు వేసుకుంటారన్నారు.మరో 6 నెలల్లో ప్రభుత్వం కూలడం ఖాయమని దయాకర్ రావు జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news