బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తలేరని, సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌తో పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులను అరెస్ట్ చేయడమేనా? ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని.. ప్రజా సమస్యలపై హైకోర్టు చీవాట్లు పెడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారడం లేదని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ప్రజా పాలన చేయడంలో వైఫ్యలం చేందాడని విమర్శించారు.