శబరిమల ఆలయానికి ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తున్నారు. శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాదు, ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఆలయం తెరిచిన 28 రోజుల్లోనే రూ.100 కోట్ల ఆదాయం స్వామివారి ఖాతాలో చేరింది. గత సీజన్ లో ఇదే సమయానికి అయ్యప్ప ఆదాయం కేవలం రూ.64 కోట్లే. ఈసారి అది మరింత పెరిగిందని చెప్పాలి.
నవంబరు 17న ఆలయం తెరుచుకోగా, సరిగ్గా ఆదివారం సమయానికి దేవస్థానం ఆదాయం రూ.104.72 కోట్లకు చేరింది. గతేడాది మహిళల ప్రవేశం కారణంగా ఉద్రిక్త పరిస్థితుల చోటుచేసుకున్నాయి. దాంతో, భక్తుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం ఆదాయంపైనా పడింది.