సమీక్ష: పాగల్

-

సినిమా: పాగల్

నటీనటులు: విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్, మురళీ శర్మ్, భూమిక చావ్లా.

దర్శకత్వం: నరేష కుప్పిలి.

సంగీతం: రాధన్

నిర్మాత: బెక్కెం వేణుగోపాల్

ఫలక్‌నుమా దాస్ సినిమాతో యూత్ లో  మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న విశ్వక్ సేన్, పాగల్ అంటూ కొత్త సినిమాతో వచ్చాడు. నివేతా పేతురాజ్ హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

హీరో ప్రేమ్(విశ్వక్ సేన్), తన తల్లి ( భూమిక) ప్రేమకు చిన్నతనంలోనే దూరం అవుతాడు. ప్రేమ్ ఏడు సంవత్సరాల వయసులో ఉండగా క్యాన్సర్ తో తల్లి మరణిస్తుంది. అప్పటి నుండి తన తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెతుకుతాడు. ఈ తరుణంలో 1600మందికి ప్రపోజ్ చేస్తాడు. కానీ అందరూ రిజక్ట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి తీరా(నివేతా పేతురాజ్), ప్రేమ్ ప్రేమని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత నివేతా పేతురాత్ వద్ద తన తల్లి లాంటి ప్రేమ దొరికిందా లేదా అన్నదే కథ.

విశ్లేషణ:

విశ్వక్ సేన్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. దాదాపు సినిమా మొత్తం తనే కనిపిస్తాడు. నివేతా పేతురాజ్ కి మరిన్ని సీన్లు పడాల్సింది. కనిపించిన కొన్ని సీన్లలో ఫరవాలేదనిపించింది. దర్శకుడు సినిమాని ఎమోషనల్‌ నుండి కామెడీకి, మళ్ళీ ఎమోషనల్ కి తీసుకెళ్ళాడు. అది పెద్ద దెబ్బ కొట్టినట్లుగా ఉంది. ఎమోషాన్ కావాల్సిన విధంగా పండకపోవడం సినిమాకి మైనస్ అయ్యింది. దర్శకుడు నరేష కుప్పిలి, ఈ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందేమో! రాధన్ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు

ముందుగానే చెప్పినట్లు సినిమా మొత్తం విశ్వక్ సేన్ కనిపిస్తాడు. చాలా ఈజ్ తో ఆ పాత్రలోకి దిగిపోయాడు. మురళీ శర్మ గారికి పెద్ద ప్రాధాన్యం కనిపించలేదు. మిగతా వారంతా తమ పరిధిలో బాగానే చేసారు.

చివరగా,

పాగల్ సినిమా రొటీన్ గా కనిపించే ప్రేమకథగా మిగిలిపోతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news