BREAKING : రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ !

-

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద… భారీగా మోహరించిన పోలీసులు… రేవంత్ రెడ్డి ని బయటికి రాకుండా నిర్బంధించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లి లో.. ఇవాళ రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటానని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయాన్నే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి ని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇది ఇలా ఉండగా  రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి మరో షాక్ ఇచ్చారు. ఇవాళ ఎర్రవెల్లి లో రేవంత్ రెడ్డి ప్రకటించిన రచ్చబండ కార్యక్రమం… ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిందని.. ఆ జిల్లా లో ఏకకై ఎమ్మెల్యే తానేనని.. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ ప్రెస్ మీట్ పెట్టేసమయంలో కానీ కార్యక్రమం ప్రకటించే టప్పుడు కానీ తనతో చర్చించలేదు ..ఇది బాధాకరమన్నారు. తాను రచ్చ బండ కు రానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version