తెలంగాణలోని బియ్యం స్కాంపై రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్

-

తెలంగాణ రాష్ట్రంలోని బియ్యం స్కాం పై కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌ చేశాడు. తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం యధేచ్ఛగా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం పంటలో నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు పందికొక్కుల్లా బొక్కారంటే రాష్ట్రం మొత్తం మీద స్కాం ఏ స్థాయిలో ఉంటుంది ? అని నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు తెలియకుండా ఇది సాధ్యమా ! ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించకుండా బీజేపీ పార్టీని ఆపుతున్నదెవరు ? అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు రేవంత్‌ రెడ్డి.

పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేసి పారేశాడని మండి పడ్డారు. కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లు… విద్యుత్ వ్యవస్థలకు అప్పులు మిగిలాయి.ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందేనని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version