తోటకూర సాగులో మేలైన విత్తన రకాలు.. తెగుళ్ల నివారణ చర్యలు

-

ఆకుకూరల్లో అందరూ కామన్ గా తినేది.. తోటకూరే. మిగిలిన వాటిని చాలా తక్కువగా వండుకుంటుంటారు. తోటకూరలో పోషకాలు ఎక్కువే. వీటి సాగులో రైతులు కూడా మంచి లాభాలు పొందవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే.. మంచి దిగుబడి వస్తుంది. వేసవిలో సైతం తోటకూరను పండిచవచ్చు. ఈరోజు మనం తోటకూరలో మేలైన విత్తన రకాలు, నాటుకునే పద్దతులు చూద్దాం.

తోటకూరలో మేలైన విత్తనాలు..

తోట కూర విత్తనాలకు సంబంధించి కో1, కో2, కో3, కో4, కో5, పూసా, చోటి చౌలై, పూసాబడి చౌలై, పూసా కీర్తి, పూసా కిరణ్, పూసాలాల్ చౌలై, ఆర్ఎన్ ఎ 1, ఆర్క సుగుణ వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి.

విత్తేముందు ఇలా చేయాలి..

విత్తనాలు వేసుకునే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మళ్ళను బాగా చదునుగా చేసుకోవాలి. మడుల్లో పలుచగా విత్తుకోవాలి. ఎకరాకు 800 గ్రాముల చొప్పున విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేయాలి. కోత రకాలలో విత్తిన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత వస్తుంది. 90 రోజులలో ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలను వేర్లతో సహా పీకి కట్టలు కడితే ఎకరాకు 3 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.

తోటకూరలో వచ్చే తెగుళ్లు.. వాటి నివారణ చర్యలు..

ఆకుల తినే గొంగలి పురుగులు : ఇవి చిన్న, పెద్ద పురుగులు అకులను కొరికి వేయడం వలన అకులు పనికి రాకుండా పోతాయి. మార్కెట్‌లో సరైన రేటు లభించదు. వీటి నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ. లీబరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత కనీసం 10 రోజుల తర్వాతే కోత కోయాలి. మొక్కలేత దశ నుండి వేప సంబంధిత పురుగు మందులను 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసినట్లయితే ఈ పురుగులు ఆశించవు.
శెల్లమచ్చ తెగులు : ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపెలవంటివి ఏర్పడతాయి. అకుపైభాగాన లేత వసువు రంగు మచ్చలు ఏర్పడి, ఎండిపోతాయి. దీని నివారణకు లీబరు నీటికి ౩గ్రా, కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 2.5గ్రా మాంకోజెబ్‌ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version