బండి సంజయ్‌ కుమారుడిపై తన స్టైల్‌లో స్పందించిన ఆర్జీవీ

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిపై దాడి చేస్తున్న వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. ‘ఇరాక్ నియంత సద్దామ్ హుస్సేన్ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు ముగిశాయని అనుకున్నా. కానీ అతడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ రూపంలో మళ్లీ పుట్టాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు’ అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై బండి సంజయ్‌ స్పందిస్తూ.. ‘కేసీఆర్… నీకు దమ్ముంటే, నువ్వు మొగోడివైతే నాతో రాజకీయం చెయ్… నాతో చేయడం చేతగాక, తట్టుకోలేక నా కొడుకును లాగుతావా?… నీ మనువడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నేనే ఖండించిన అని ఆయన అన్నారు.

 

చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి కూడా లేదా? నా కొడుకు విషయంలో ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేసు పెట్టిస్తవా? నేను తప్పు చేశానని ఆ అబ్బాయే (దెబ్బలు తిన్న శ్రీరాం అనే విద్యార్థి) ఒప్పుకున్నడు. అయినా పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటరు. మళ్లీ కలుస్తారు. మరి నీకేం నొచ్చింది? కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చింది? కంప్లయింట్ ఎవరిచ్చారు? నీ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతావా? నా కొడుకుతోసహా ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేస్తావా? థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదు’’ అంటూ బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడిపై కేసీఆర్ ఫ్రభుత్వం కేసు నమోదు చేసిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version