నీకు దమ్ముంటే… మొగోడివైతే నాతో రాజకీయం చెయ్ : బండి సంజయ్‌

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతోన్న బండి భగీరథ్.. ఓ విద్యార్థిని తిడుతూ దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే దీనిపై తాజాగా బండి సంజయ్‌ స్పందించారు. తన కొడుకుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు మందు కోసం కాజాగూడలో గొడవ చేయలేదన్నారు బండి సంజయ్. పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు.. మళ్లీ కలుకుంటారన్న సంజయ్.. అంత మాత్రానికే పిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారని నిలదీశారు. తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారా.. ప్రోసిజర్ ఫాలో అయ్యారా.. అని పోలీసులను ప్రశ్నించారు. కేసీఆర్ మనుమడి విషయంలో కామెంట్ చేస్తే తాను వ్యతిరేకించినట్టు గుర్తుచేశారు.

ఒకవేళ తప్పు చేసుంటే తానే జైలుకు తీసుకొచ్చి అప్పగిస్తానని బండి సంజయ్ తెలిపారు. “నేనే పోలీసులకు అప్పగిస్తా.. థర్డ్ డిగ్రీ చేస్తారా..” అంటూ నిలదీశారు. సీఎం పాపం పండుతుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ వీడీయోపై బాధిత విద్యార్థి కూడా స్పందించాడు. భగీరథ్ తనను కొట్టిన విషయం నిజమే.. కానీ.. అందులో తనదే తప్పుందని క్లారిటీ ఇచ్చాడు. భగీరథ్ వాళ్ల ఫ్రెండ్ చెల్లెలిని ప్రేమించాలంటూ ఫోన్లు, మెస్సేజ్‌లు చేసి విసిగించానని.. అది తెలిసి భగీరథ్ తనను నిలదీశాడని చెప్పాడు. అయితే.. ఆ సమయంలో కొంటె ఎక్కువగానే మాటలు తూలటంతో… కోపంతో భగీరథ్ తనని కొట్టాడని వివరించారు. ఆ తర్వాత.. ఇద్దరు కలిసిపోయామని.. తాము స్నేహితులమని.. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవంటూ చెప్పుకొచ్చాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version