RGV : ”తులసి తీర్థం” తో భయపెట్టేందుకు వస్తున్న ఆర్జీవీ

-

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. ఎప్పుడూ ఏదో ఓ విషయం పై ఏదో ఓ ట్వీట్‌ చేస్తూ… వివాదాలకు తెర లేపుతుంటారు.. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు చేయడమే కాకుండా… రెగ్యులర్ గా అక్కడి రాజకీయాలపై కామెంట్ చేస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ.

ఇక ఇటీవలే… కొండా సురేఖ దంపతులపై సినిమా ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ… తాజాగా… మరో దెయ్యం సినిమాతో వస్తున్నారు వర్మ. ”తులసి తీర్థం” అనే టైటిల్‌ ను కూడా ఫిక్స్‌ చేశారు రామ్‌ గోపాల్ వర్మ. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ”నా తదుపరి భయానక చిత్రం “తులసి తీర్ధం” యండమూరి వీరేంద్రనాథ్ రచించిన సంచలనాత్మక షాకింగ్ నవల “తులసి దళం”కి సంభావిత సీక్వెల్ .దీనిని భీమవరం టాకీస్ నిర్మించింది.” అంటూ ట్వీట్‌ కూడా చేశారు రామ్ గోపాల్‌ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news