పేర్ని నానికి ఆర్జీవీ సవాల్.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు !

-

గత కొన్ని రోజుల నుంచి… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ పెద్దల మధ్య వివాదం చెలరేగుతోంది. సినిమా టికెట్ల ధరలను పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై సినీ పెద్దలు డిమాండ్‌ చేస్తూంటే..జగన్‌ సర్కార్‌ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అయితే.. ఈ వివాదంపై ఎప్పుడూ లేని విధంగా.. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా… జగన్‌ సర్కార్‌ పై ఓ రేంజ్‌ రెచ్చి పోతున్నారు. ఇక తాజాగా పేర్ని నానికి సవాల్‌ విసిరారు వర్మ.

”సినిమా ఎంతో కష్టపడి ఓ నిర్మాత తీస్తే..దానికి ప్రభుత్వం ఎలా రేటు ఫిక్స్‌ చేస్తుంది. పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు… రేషన్‌, పంచదార, కిరోసిన్‌ తక్కువ ధరకు ఇస్తుంది. కానీ ఆ సూత్రాన్ని సినిమా టికెట్లకు అమలు చేయడం ఎంత వరకు సమంజసం సారూ. కాబట్టి… టికెట్ల ధరలలో ఆంధ్ర ప్రదేవ్‌ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చాలా తప్పు. ఆడమ్ స్మిత్ ఆర్థిక సూత్రాల ప్రకారం… ప్రైవేట్‌ సంస్థల ఉత్పత్తులపై ధరలు నిర్ణయించే హక్కు ఏ ప్రభుత్వాలకు లేవు.సినిమా టికెట్ల విషయంలోనూ ఇంతే ” అంటూ పేర్ని నానిపై ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు వర్మ. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version