తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక అయిన ఎమ్మెల్సీ లకు తమ నియోజక వర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఒక్కో ఎమ్మెల్సీకి రూ. 2.50 కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు. అంతే కాకుండా వారికి జిల్లాలను కేటాయిస్తు సీడీసీ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఎమ్మెల్సీ ప్రతిపాదనలను ఆమోదించడానికి మంత్రుల జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డికి నల్గొండ జిల్లాను కేటాయించారు.
అలాగే ప్రతిపాదనలు ఆమోదించడానికి మంత్రి జగదీశ్ రెడ్డిని ఫైనల్ చేశారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ జిల్లాను కేటాయించి ఆమోదించడానికి మంత్రి గంగుల కమలాకర్ ను కేటాయించారు. అలాగే రవీందర్ రావు కు మహబూబ్ నగర్ జిల్లాను, అలాగే మంత్రి సత్యవతి రాథోడ్ ను ప్రతిపాదనలను ఆమోదించడానికి కేటాయించారు. కడియం శ్రీహరికి జనగామ జిల్లాను కేటాయించారు. బండ ప్రకాశ్ కు వరంగల్ కేటాయించారు. వీరి ప్రతిపాదనలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమోదిస్తారు. అయితే శాసన సభ కోటాలో గెలిచిన మరో ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయాల్సి ఉంది.