రిక్కీ పాంటింగ్: బంతిని మార్చడం వల్లనే ఆస్ట్రేలియా ఓడింది … !

-

నిన్న రాత్రి ముగిసిన యాషెస్ సిరీస్ అయిదవ టెస్ట్ లో ఇంగ్లాండ్ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆఖరి రోజున వర్షం ఎన్నో టెన్షన్ లు పెట్టిన తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగిపోయి అస్ర్ట్రేలియా ను ఆల్ అవుట్ చేసి 49 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలుచుకుని యాషెస్ సిరీస్ ను సమం చేశారు. అయితే ఈ మ్యాచ్ ఫలితం పైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈయన ఒక ఛానెల్ తొ మాట్లాడుతూ ఆస్ట్రేలియా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ ను ఓడిపోవడం చాలా బాదాహకరం అని చెప్పాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ను గెలుచుకున్న విధానం పట్ల నేను సంతృప్తికరంగా లేనని కామెంట్ చేశాడు. నాలుగవ రోజు ఆటలో భాగంగా మార్క్ వుడ్ వేసిన ఒక బంతి ఖవాజ్ హెల్మెట్ తగలడంతో అంపైర్లు బంతిని మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పుడు పాత బంతికి బదులుగా కొంచెం బాగున్నబంతిని సెలెక్ట్ చేశారు.

 

ఆ బంతితోనే ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పై పైచేయి సాధించారు అని పాంటింగ్ తన అభిప్రాయాన్ని తెలియచేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version