కేంద్ర ప్రభుత్వం డబ్బు పొదువు చేసుకోవాడానికి ఎన్నో పొదుపు పథకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళలకు, చిన్నపిల్లలకు అవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. చిన్న చిన్న మొత్తాల్లో సేవ్ చేసుకుని ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. అయితే ఇలాంటి వాటిల్లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. చాలా మంది ఆడపిల్లల చదువులు, పెళ్లి కోసం చిన్నప్పటి నుంచే ఈ స్కీమ్‌లో జాయిన్ అయిపోయారు. ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఈరోజం మనం ఇది ఎంత వరకూ లాభదాయకం, ఇందులో ఉన్న లాభనష్టాలను ఓసారి చూద్దాం..! పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రభుత్వం 8 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఈ పథకం 21 ఏళ్ల వరకు లేదా 18 ఏళ్లు నిండిన అమ్మాయికి పెళ్లి అయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది. తల్లిదండ్రులు 10 ఏళ్లలోపు వారి కుమార్తె పేరు మీద సుకన్య సమృద్ధి యోజన కింద ఖాతా తెరవవచ్చు.
లాక్ ఇన్ పీరియడ్: 21 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్. అంటే, మెచ్యూరిటీకి ముందు డబ్బు విత్‌డ్రా చేయలేము. అత్యవసర ఖర్చుల కోసం డబ్బు అవసరం కావడం కష్టం. అకాల మరణం వంటి అసాధారణమైన సందర్భాల్లో అకాల ఉపసంహరణ అనుమతించబడుతుంది.
పరిమిత డిపాజిట్: పెట్టుబడి మొత్తం లేదా ఫ్రీక్వెన్సీ పరంగా ఎటువంటి వశ్యత లేదు. ఏటా కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు వార్షిక కనీస పెట్టుబడి తప్పనిసరి.
తక్కువ రాబడి: ఈ పథకం చాలా పొదుపు ఖాతాల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ మరియు బాండ్లతో పోలిస్తే రాబడి చాలా తక్కువ.
కూతుళ్లకు మాత్రమే వర్తిస్తుంది: సుకన్య సమృద్ధి యోజన కేవలం కుమార్తెలకు మాత్రమే వర్తిస్తుంది, అంటే కొడుకు లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుబడి పెట్టకూడదు.
పన్ను ప్రయోజనాలు: ఈ పథకంలో పెట్టుబడికి పన్ను ప్రయోజనం ఉంటుంది కానీ పెట్టుబడిపై వచ్చే వడ్డీకి పన్ను విధించబడుతుంది. మెచ్యూరిటీకి ముందు ఉపసంహరణకు జరిమానా విధించబడుతుంది మరియు పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.