వాకింగ్ స్టిక్ పడేసి వచ్చేస్తున్న పంత్‌.. వీడియో వైరల్‌

-

టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కారు డివైడర్ ని ఢీకొనడంతో పంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడ్డ పంత్ చికిత్స తీసుకొని వేగంగా కోలుకుంటున్నాడు. అయితే.. పంత్ కాలికి, వీపుకు బలమైన గాయాలు కావడంతో, చాలాకాలం మంచానికే పరిమితం అయ్యాడు.

కొంతకాలంగా పంత్ వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నాడు. అయితే, తాజా వీడియో పంత్ అభిమానులను కచ్చితంగా సంతోషానికి గురిచేస్తుంది. చేతిలో ఉన్న ఊతకర్రను అక్కడే ఉన్న వ్యక్తిపై విసిరేసిన పంత్ కాస్త హుషారుగా నడవడం ఈ వీడియోలో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. పంత్ ను మళ్లీ ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉందని, టీమిండియాలోకి అతడి పునరాగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version