ఏపీ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

-

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రైవేట్‌ కళాశాలపై ఇంటర్ బోర్డు కొరడా ఝలిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంటర్ ప్రైవేట్ కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం ఇప్పటి వరకు అమలులో ఉన్న జరిమానాలను దాదాపు 5 రెట్ల వరకు పెంచుతూ ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అనుమతులు తీసుకున్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతలో కళాశాలలను మార్చితే జరిమానా విధిస్తామని తెలిపింది. మున్సిపాలిటీల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుమతి లేకుండా కళాశాలను మార్చితే విధించే జరిమానా రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచింది.

మండలం నుంచి మండలానికి, మండలం నుంచి పురపాలక, నగరపాలక ప్రాంతానికి అనధికారికంగా మార్చితే విధించే జరిమానాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంతేకాదు అనుమతులు లేకుండా ఇతర సొసైటీలు, ట్రస్టులకు మార్పు చేసినా రూ.5 లక్షలు జరిమానా చెల్లించాల్సిందేని ప్రకటించింది. మహిళా కళాశాలగా అనుమతి తీసుకొని కో ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తే రూ.2లక్షల వరకు జరిమానా తప్పదని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version