రితేష్‌కు ఇప్ప‌టికే పెళ్లి అయింది.. విడాకుల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ ఇచ్చిన రాఖీ సావంత్

-

వాలెంటైన్స్ డే రోజున బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్.. భ‌ర్త రితేష్తో విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. కాగ ఎంతో కాలంగా ప్రేమించుకుని.. బిగ్ బాస్ 15 ద్వారా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసి.. పెళ్లి చేసుకున్న జంట విడాకులు తీసుకోవ‌డంతో బాలీవుడ్ తో పాటు చిత్ర ప‌రిశ్ర‌మలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అలాగే వాలెంటైన్ డే వంటి ప్రేమికుల రోజున విడాకుల గురించి ఈ హాట్ క‌పుల్స్ ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యప‌డిపోయారు. బ‌హిరంగంగానే లిప్ కిస్సులు, రోమాన్స్‌లు చేసే ఈ జంట విడిపోవ‌డం అంద‌రినీ అవాక్క‌య్యేలా చేసింది.

కాగ తాజా గా రాఖీ సావంత్.. ఒక ఇంట‌ర్వ్యూలో త‌న‌ విడాకుల గురించి వివ‌రించింది. రితేష్ కు ఇప్ప‌టికే ఒక పెళ్లి అయిందని.. అంతే కాకుండా ఒక పాప కూడా ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాను బిగ్ బాస్ హౌసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినప్పుడు కూడా రితేష్ కు ఇదివ‌ర‌కే పెళ్లి అయిన‌ట్టు త‌న‌కు తెలియదని బాంబ్ పెల్చింది. అయితే మొద‌టి భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండా.. రెండో పెళ్లి చేసుకోవ‌డం చ‌ట్ట బ‌ద్ధం కాద‌ని అన్నారు. అందుకే రితేష్ తో విడిపోవాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించింది.

 

అయితే రితేష్ ప్ర‌స్తుతం మొద‌టి భార్య విడాకుల విషయంలో న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాడ‌ని తెలిపింది. మొద‌టి భార్య‌కు పూర్తిగా విడాకులు ఇచ్చి.. న్యాయ ప‌ర‌మైన చిక్కుల‌ను తొల‌గించుకుంటే.. రితేష్ ను మ‌ళ్లీ పెళ్లి చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది. అయితే అప్పుడు రితేష్ కు సొంత ఇల్లు, కారు ఉండాల‌ని రాఖీ సావంత్ కండీషన్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news