ఆడవారికి గర్భిణీ సమయంలో ఎన్నో నియమాలు ఉంటాయి. వారి ఆరోగ్యం కోసం మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా పూర్వీకుల నుండి పాటించిన సాంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాటిలో భాగంగానే సీమంతం వేడుకను కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఇటువంటి పురాతన పద్ధతులను అందరూ పాటిస్తూ వస్తున్నారు. గర్భిణీలు చేతులకి గోరింటాకు పెట్టకూడదని కొంతమంది అంటూ ఉంటారు. ఈ విషయాన్ని పెద్దలు కూడా చెబుతూ వస్తున్నారు.
మహిళలకు సహజంగా గోరింటాకు అంటే ఇష్టం. అయితే గర్భిణీ స్త్రీలు ప్రెగ్నన్సీ సమయంలో మాత్రం గోరింటాకు పెట్టుకోకూడదని అంటూ ఉంటారు. నిజానికి హిందూమతంలో 16 అలంకారాలలో గోరింటాకు ఒకటి. కేవలం పెళ్లికి మాత్రమే కాకుండా ఎలాంటి శుభకార్యాలు మరియు పండగలు వచ్చినా సరే తప్పకుండా గోరింటాకును పెట్టుకుంటారు అంటే స్త్రీలకు గోరింటాకు అనేది ఒక శుభప్రదంగా భావించడం జరుగుతుంది. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో గోరింటాకును పెట్టుకోవడం వలన హాని ఉందని పెద్దలు చెబుతున్నారు. గోరింటాకు ఆనందాన్ని మరియు ప్రేమను సూచిస్తుంది ఇది శుక్ర గ్రహానికి సంబంధించింది మరియు గోరింటాకు పెట్టుకోవడం వలన శుక్ర గ్రహం శక్తిని తీవ్రతరం చేస్తుంది.
ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ సమయంలో గ్రహాల ప్రభావం పట్ల ఇబ్బంది కలుగుతుందో ఆ సమయంలో గోరింటాకు పెట్టుకోకపోవడమే మేలు. గర్భిణీ స్త్రీ జాతకంలో ఎప్పుడైతే శుక్రుడు బలహీనంగా ఉంటాడో అటువంటి సమయంలో గోరింటాకు పెట్టుకోకూడదు. దీనివలన సానుకూల ప్రభావాలకు బదులుగా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. అంతేకాక జాతకంలో శని, రాహు లేదా కేతు వంటి గ్రహాలు బలంగా ఉన్నప్పుడు గోరింటాకును పెట్టుకోవడం వలన మరింత ముప్పు ఉంటుంది. ముఖ్యంగా ఆందోళన, ఒత్తిడి వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. అందుకే పండితులు ప్రెగ్నెన్సీ సమయంలో గోరింటాకు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.