టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు జావెలిన్ త్రో లో నీరజ చోప్రా శనివారం పసిడి పతకాన్ని అందించాడు. నిన్న జరిగిన జావెలిన్ బ్రో లో రికార్డు స్థాయిలో 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా కలలుకంటున్న బంగారు పతకాన్ని నిజం చేసి చూపించాడు నీరజ్ చోప్రా. దీంతో నీరజ్ చోప్రా పై దేశ వ్యాప్తంగా ప్రశంశలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా తాజాగా రేస్ జాకీ మలిష్కా మెండోన్సా అనే టీవి నటికి నీరజ్ చోప్రా ఆన్ లైన్ లోనే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన గెలుపు గురించి చెప్పాడు నీరజ్ చోప్రా. అయితే ఈ నేపథ్యం లోనే ఆర్. జె.మలిష్కా.. నీరజ్ చోప్రా హాగ్ అడిగింది. అయితే ఆర్. జె.మలిష్కా అడిగిన దానికి నీరజ్ చోప్రా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు నీరజ్ చోప్రా. “హాగ్ ఇవ్వడం కుదరదు.. దూరం నుంచి ఒక హాయి చెప్పు చాలు” అంటూ షాకింగ్ రిప్లే ఇచ్చాడు. దీంతో ఆర్. జె.మలిష్కా షాక్ తింది. అయితే ఇంటర్వ్యూ చివరలో ఆర్. జె.మలిష్కా తో ఆమె ఫ్రెండ్స్.. నీరజ్ చోప్రా డాన్స్ చేశారు. ప్రస్తుతం వారు చేసిన డాన్స్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తోంది.