క్రికెట్ ఆడిన కీలక నేత, వీడియో వైరల్…!

-

బీహార్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలా అయినా సరే బిజెపిని ఇబ్బంది పెట్టి అధికారంలోకి రావాలని ఆర్జెడి, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ముఖ్యంగా జేడియు ని అధికారం నుంచి దింపాలని ఆర్జెడి పట్టుదలగా ఉంది. ఇటీవల జరిగిన ఝార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి బిజెపికి చుక్కలు చూపించాలి అని భావిస్తుంది. ఎన్నార్సి విషయ౦ లో ప్రశాంత్ కిషోర్ ప్రజల్లోకి బలంగా బిజెపి వ్యతిరేకతను తీసుకువెళ్ళే యత్నం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి ప్రజల్లోకి బలంగా బిజెపి మీద ఉన్న వ్యతిరేకతను తీసుకువెళ్తున్నారు. జేడియు నుంచి ఆయనను తప్పించారు. ఇప్పుడు ఆయన విపక్షాలకు పని చేస్తున్నారు. ముందు నుంచి అనుకున్న విధంగానే ఆయన ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా మారిపోయారు. ఆర్జెడి కూడా ప్రజల్లోకి వినూత్నంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ వస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ ప్రతిపక్ష నేత, ఆర్జెడి కీలక నేత తేజస్వీ యాదవ్ క్రికెట్ ఆడుతున్న వీడియో వైరల్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ బిజీ షెడ్యూల్ మధ్య క్రికెట్ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఆయన. పాట్నాలోని బీహార్ వెటర్నరీ కాలేజీ మైదానంలోకి వచ్చి లోకల్ టీమ్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడారు.

ఓసారి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ కూడా ఆడారు. 2008, 2009, 2011, 2012 ఐపీఎల్‌ సీజన్స్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు తేజస్వి ఆడారు. అయితే డ్రెస్సింగ్ రూమ్ కి మాత్రమే ఆయన పరిమితం అయ్యారు అప్పట్లో. రాజకీయాల్లోకి రాకముందు క్రికెటర్‌ గా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2015 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆర్జెడి, జేడియు కూటమి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పని చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version