మహేష్ మూవీ లో విజయ్ కాదా……విజయ్ మూవీలోనే మహేష్…..??

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వరుసగా కెరీర్ పరంగా ఆయనకు ఇది మూడవ విజయం అని చెప్పాలి. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను, అలానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలతో కూడా మహేష్ రెండు హిట్స్ కొట్టారు. ఇక అతి త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి సినిమాలో నటించనున్న మహేష్, ఆ సినిమా కోసం అన్నివిధాలా సిద్దమవుతున్నట్లు టాక్.

ఇకపోతే ఈ సినిమాలో యువ హీరో విజయ్ దేవరకొండ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే దానిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ విషయం అటుంచితే, మహేష్ సినిమాలో విజయ్ కాదు, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ఫైటర్ సినిమాలో మహేష్ కొన్ని క్షణాలపాటు ఒక చిన్న క్యారెక్టర్ లో తళుక్కున మెరవనున్నట్లు తాజా టాలీవుడ్ వర్గాల టాక్.

 

అయితే ఈ విషయాన్ని ఇప్పుడే బయటకు తెలియపరిస్తే ఆ కిక్ ఉండదని భావించిన దర్శకుడు పూరి దీనిని గోప్యంగా ఉంచారని, కానీ కొందరు ఆ సినిమా యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని బయటకు లీక్ చేసారని అంటున్నారు. కాగా ప్రస్తుతం అటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్న ఈ న్యూస్ కనుక నిజమే అయితే అటు రౌడీ ఫ్యాన్స్ తో పాటు ఇటు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు కూడా ఇది మంచి పండుగ వార్తే అని చెప్పకతప్పదు…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version