మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్ నుండి భాగ్యనగర్ సొసైటీ వైపు ద్విచక్ర వాహనం పై ఇద్దరు యువకులు వెళుతుండగా అక్కడ మాదాపూర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీన్ని గమనించిన యువకులు పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో ఎన్ ఐ ఏ వద్ద అతి వేగంగా వచ్చి కార్ ను ఢీ కొట్టారు.ఈ ప్రమాదంలో కింద పడ్డ ఇద్దరిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా…మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుడిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నుండి తప్పటించుకునే క్రమంలోనే యువకులు కార్ యాక్సిడెంట్ కు గురయ్యారని గుర్తించారు.
మాదాపూర్ లో రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి మరొకరికి సీరియస్..!
-