బెంగాల్లో ఆధిక్యంలో త్రుణమూల్ కాంగ్రెస్

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగాల్ బైపోల్ కౌంటింగ్ జరగుతోంది. గత సెప్టెంబర్ 30న బెంగాల్ లోని భవానీపూర్, సంసేర్ గంజ్, జంఘీపూర్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీపై త్రుణమూల్ కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. గత బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. తాజాగా తన పార్టీ సభ్యుడిని భవానీపూర్ నుంచి రాజీనామా చేయించి తను పోటీీ చేస్తుంది. ప్రస్తుతం భవానీపూర్ లో 6 రౌండ్లు దాటిన తర్వాత 12 వేల ఓట్ల ఆధిక్యంలో దీదీ ఉన్నారు.

 రెండోస్థానంలో బీజేపీ నేత ప్రియాంక టిబ్రివాల్ ఉన్నారు. మిగతా రెండు స్థానాల్లో కూడా త్రుణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. గత పోలింగ్ లో భవానీపూర్ ఎన్నికల్లో 55 శాతం ఓట్లు పోలయ్యాయి. ముర్షిదాబాద్ జిల్లా పరిధిలోని షంషేర్ గంజ్, జంఘీపూర్ నియోజకవర్గాల్లో రికార్డ్ స్థాయిలో 70 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.